ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొనడంతో బైక్పై ఉన్న ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గైగోళ్లపల్లి వాసిగా గుర్తించారు.