సత్యసాయి: బుక్కపట్నం మండలం మదిరేబైలు గ్రామానికి చెందిన బాలరాజు అనారోగ్యంతో అనంతపురంలోని కుమార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ ఆదివారం ఆసుపత్రికి వెళ్లి బాలరాజును పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.