ELR: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తొలుత హెలికాప్టర్లో రాజవరం రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆయన రోడ్డు మార్గంలో రానున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, రాజవరం మీదుగా ఐ.ఎస్.జగన్నాథపురం చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.