KMM: మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడా వెంకన్న అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ (M) తీర్థాల గ్రామపంచాయతీ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమంలో భాగంగా నాణ్యమైన చీరలను అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.