KNR: సైదాపూర్ మండలంలోని 39 మంది లబ్ధిదారులకు రూ. 39,00,624 విలువైన కల్యాణ లక్ష్మీ చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. మహిళా సంఘాలలో సభ్యులు కానివారు వెంటనే చేరి, బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందవచ్చని పొన్నం సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంత సుధాకర్, ఎమ్మార్వో గుర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు.