NLR: కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 54 డివిజన్లు ఉండగా వీటిని 71కు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఆదివారం నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దీనిపై చర్చించారు.