కర్నూలు: రౌడీ షీటర్లకు కర్నూలు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారికి స్థానిక పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో జీవించి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. మళ్లీ నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.