BPT: ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. కొల్లూరు మండలానికి చెందిన ఐదుగురు అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మంజూరైన రూ.3,47,992 చెక్కులను ఎమ్మెల్యే ఆదివారం అందజేశారు.