SRD: క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేది క్రీడలేనని BRS రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఇవాళ అన్నారు. పటాన్ చెరు మండలం భానూరులో ఆర్.కె క్లబ్ వారు ఓపెన్ టూ ఆల్ అండర్ 14 బాలికల క్రీడలు నిర్వహించారు. కాగా ఈ విభాగంలో గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన స్పార్టెన్స్ టీమ్ మొదటి బహుమతి గెలుచుకుంది. ఈ సందర్భంగా వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.