కృష్ణా జిల్లాలో రోడ్డు భద్రతను పెంపొందించేందుకు పోలీసులు ముందడుగు వేశారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించే పులిగడ్డ జంక్షన్ వద్ద ప్లాస్టిక్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ పనిని అవనిగడ్డ సీఐ యువ కుమార్, ఎస్సై శ్రీనివాస రావు పర్యవేక్షణలో వేగవంతంగా పూర్తి చేశారు. అధికారులు వాహనదారులకు సురక్షిత ప్రయాణం కోసం అవసరమైన సూచనలు కూడా అందించారు.