PLD: నరసరావుపేట కూరగాయల, ఫిష్ మార్కెట్లలో ఆదివారం లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారి శ్రీకర్ ఆధ్వర్యంలో బరువుల ప్రమాణాలు, కొలతలు, రేట్బోర్డులను పరిశీలించారు. నియమాలను ఉల్లంఘించిన పలువురు వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యాపారులు ఖచ్చితమైన బరువులు వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు అందించారు.