కోనసీమ: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్య సాయిబాబా కేవలం ఆధ్యాత్మిక వేత్తగానే కాకుండా విద్య, వైద్య, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాలలో విశేష సేవలు అందించారన్నారు.