అన్నమయ్య: రైల్వే కోడూరులోని HMM పాఠశాలలో ఆదివారం ముక్కా రూపానంద్ రెడ్డి ఫౌండేషన్, శ్రీ వెంకటేశ్వర అరవింద్ తిరుపతి సహకారంతో ఉచిత మెగా కంటి శిబిరం జరిగింది. ప్రజలు వర్షాన్ని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇది ఫౌండేషన్ నిర్వహించిన ఆరో ఉచిత మెగా కంటి శిబిరమని, కోడూరు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో శిబిరాలు నిర్వహిస్తున్నామని రూపానందరెడ్డి తెలిపారు.