GNTR: PGRS అర్జీలను ఇప్పుడు Meekosam.ap.gov.in వెబ్సైట్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. అలాటగే కార్యాలయాల్లో నేరుగా కూడా అర్జీలు ఇవ్వవచ్చన్నారు. అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లావాసులు ప్రభుత్వం అందించిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.