ATP: జిల్లాలో పండిన అరటిని ముంబై, కలకత్తా లాంటి మార్కెట్లకు తరలించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనికోసం రైల్వే వ్యాగన్లను పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అరటి, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై ధరలు పెంచేందుకు ప్రతీరోజు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు.