AP: నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలో ఆదిలక్ష్మి ఆలయ నిర్మాణానికి మంత్రి ఆనం రామనారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. పెంచలకోన సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని వెల్లడించారు.