WGL: మాధన్నపేట చెరువులో ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారదతో కలిసి 6 లక్షల 81 వేల చేప పిల్లలను విడుదల చేశారు. వీటి మొత్తం విలువ రూ.11.50 లక్షలుగా తెలిపారు. మత్స్య సంఘ సభ్యులు ప్రైవేట్ వారికి అప్పగించకుండా స్వయంగా చేపల సాగు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.