GNTR: ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొన్న ఘటన చిలకలూరి పేట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మురికిపూడిలో నుంచి ఆర్టీసీ బస్సు బైపాస్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ బైకుని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.