E.G: సప్పా ఎక్సలెన్స్ అవార్డు-2025 కార్యక్రమం రాజమండ్రి సంహిత కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 43 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందిస్తూ వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను ఈ వేదికపై సన్మానించారు. సమాజ అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయన్నారు.