VSP: ప్రకృతి పంటల రైతుల నడకను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. ఈనెల 29వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద నడక నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. ఆర్గానిక్ మేళా విజయానికి సాంస్కృతిక బ్రుందాలతో నడక ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.