ASF: సిర్పూర్(U) మండలంలోని కోహినూర్ (కే) ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నాందేవ్ ఆదివారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన జోనల్ స్థాయి గిరిజన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి చేరడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థినులకు విద్యతో పాటు క్రీడలు సైతం నేర్పిస్తున్నామని అన్నారు.