MBNR: జడ్చర్ల పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 15వ జయంతి సందర్భంగా ఈ నెల 25న యూనిటీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు బీఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.