AP: వైసీపీ హయాంలో మైనింగ్ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మైనింగ్ యజమానులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడిప్పుడే తాము అన్నీ సరిదిద్దుతున్నామని తెలిపారు. ప్రభుత్వ కొత్త పాలసీల వల్లే సీఐఐ సమ్మిట్‌లో రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నకిలీ మద్యం ఘటన దురదృష్టకరమని, YCP చేసిన స్కామ్‌ను వెలికితీస్తున్నామని పేర్కొన్నారు.