ATP: రాప్తాడులోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోజా రాకతో అక్కడ సందడి నెలకొంది. ఆమెను కలిసిన అభిమానులు, కార్యకర్తలు సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపించారు. ఈ పెళ్లికి వైసీపీ ప్రముఖ నేతలంతా తరలివచ్చారు.