SKLM: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యసాయి బాబా ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించారన్నారు. అలాగే సత్యసాయి బాబా సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ఉచిత వైద్యసేవలు నిర్వహిస్తున్నారన్నారు.