ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ నారాయణ స్వామికి భక్తిశ్రద్ధలతో మహిళలు పొంగళ్ళు స్వామి వారికి మహా నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.