SRCL: ఇస్లాంనగర్‌లో షాదీఖానా నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పరిధిలోని ఇస్లాంనగర్‌కు చెందిన సుమారు 200 మంది ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.