కెనడా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్-సీ3కి రాజు ఆమోదముద్ర లభించింది. దీంతో ఈ నిబంధనలు అతి త్వరలోనే అమల్లోకి రానున్నాయి. విదేశాల్లో జన్మించిన వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం సంక్రమించకుండా అడ్డుకుంటున్న పాత నిబంధనను తొలగించనున్నారు. ఈ నిబంధన వల్ల నష్టపోయిన వారి సమస్య పరిష్కారం కానుంది.