GNTR: రైతులు కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆదివారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలియజేశారు. వాట్సాప్లో 7337359375 నెంబర్కు Hi అని పంపితే అన్ని సేవలు వెంటనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతులు ఏ కేంద్రంలో ఏ రకం ధాన్యం ఎన్ని బస్తాలు అమ్మదల్చుకున్నారో వివరాలు ఇస్తే స్లాట్ బుక్ అవుతుందని చెప్పారు.