E.G: సామాజిక మాధ్యమాల్లో రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన బీపీ మందులు ఇస్తున్నారు అనే ఆరోపణలు వ్యాప్తి చెందాయి. ఈ అంశంపై ఆదివారం రాజమండ్రి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వద్ద జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. పీవీవీ సత్యనారాయణ అత్యవసర సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో ప్రకటించిన పోస్ట్‌కు జీజీహెచ్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.