కోనసీమ: ఉచిత మెడికల్ క్యాంప్‌ల ఏర్పాటు ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుందని, వారికి మంచి వైద్యం చేరువవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. పొడగట్లపల్లిలో ఇవాళ ఏవీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రోగులకు కంటి పరీక్షల విధానాన్ని పరిశీలించారు.