W.G: శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలను ఇవాళ ఇరగవరం మండల కార్యాలయంలో నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.