సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మానవ సేవే మాధవ సేవగా నమ్మి, పేద ప్రజలకు ఉచిత వైద్యం, విద్య, తాగునీరు అందించి చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు శ్రీ సత్యసాయి అని’ ఆయన కొనియాడారు. సాయి సేవ, ప్రేమ స్ఫూర్తితోనే అందరి జీవితాలు జీవం పోసుకుంటాయని పేర్కొన్నారు.