KDP: బద్వేలు నియోజకవర్గానికి చెందిన కొప్పరపు వెంకట సుబ్బమ్మ ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేలు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితేష్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి, పార్తివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.