SKLM: శ్రీకాకుళంలోని స్ధానిక సత్యసాయి మందిరంలో ఇవాళ భగవాన్ శ్రీ సత్య సాయి శత జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని కోరారు.