VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇవాళ నుంచి ఆరు రోజులు పాటు ప్రజలకు అందుబాటులో ఉండరని ఎస్. కోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే లలిత కుమారి తన కుటుంబ సమేతంగా షిరిడి వెళ్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరని తెలిపారు.