ELR: జిల్లాని స్వచ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. జిల్లాలో ప్రతీ ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్నీ మండలాల్లో అవసరమైన సామాజిక మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలను రేపు సాయంత్రంలోగా పంపాలన్నారు.