NGKL: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. వెల్దండ మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో శనివారం సూర్యలక్ష్మి కాటన్ మిల్ ఆమనగల్ సహకారంతో వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో ‘హరితవారధి’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో రమేష్ మొక్కలు నాటారు.