ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, గడువు ముగిసిన పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు అందించే ఆహారం సురక్షితంగా ఉండాలన్నారు.