హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ బరిలో నిలించింది. 98వ అకాడమీ అవార్డులకు (ఆస్కార్స్ 2026) ‘బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్’ విభాగంలో అర్హత సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. వచ్చే నెల16న ఆస్కార్-2026 షార్ట్‌లిస్ట్, వచ్చే ఏడాది జనవరిలో తుది నామినేషన్లు ప్రకటిస్తారు.