SDPT: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గజ్వేల్ (వర్గల్) చెందిన తూముకుంట ఆంక్షారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నియామకపు ఆదేశాలు జారీ చేశారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి కూతురైన ఆంక్షా రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.