HYD: ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువు నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా మరచిపోయింది. దాదాపు 70 ఎకరాలలో ఈ చెరువు విస్తరించి ఉంది. పలు ప్రాంతాల నుంచి మురుగునీరువచ్చి నేరుగా చెరువులో చేరుతోందని స్థానికులు వాపోతున్నారు. కాలుష్య కాసారంగా మారిన ఈ చెరువుతో తాము అనారోగ్యాల బారిన పడుతున్నామని, అధికారులు ఇప్పటికైనా చెరువు గురించి పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.