E.G: రాజమండ్రిలోని 13వ వార్డులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీ మాధవ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా శాంతిపురం, తాడితోట ప్రాంతాల ప్రజలతో మమేకమయ్యారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆడబాల రామకృష్ణ, అసెంబ్లీ కన్వినర్ రంగబాబు, పిక్కి నాగేంద్ర, రవి శంకర్, చింతపల్లి సాయి పాల్గొన్నారు.