MDCL: జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ హైవేపై పిల్లర్ నెంబర్ 102 వద్ద యాదాద్రి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొనబోయింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.