RR: హయత్ నగర్ డివిజన్లోని శాన్వి హోమ్స్ ప్రెసెంట్స్ కాలనీవాసులు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కార్పొరేటర్‌కు వినతి పత్రం అందించారు. స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.