TPT: రేణిగుంట వద్ద అమర్ రాజా సీ-టైప్ క్వార్టర్స్‌లో భారీ దొంగతనం జరిగింది. ఇందులో దుండగులు ఏకంగా 7 ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. యజమానులు నైట్ డ్యూటీలకు, ఊర్లకు వెళ్లిన సమయం చూసి చేతివాటం ప్రదర్శించారు. సెక్యూరిటీ ఉన్నా వెనుక గోడ దూకి వచ్చిన దొంగలు బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.