చదువుతున్నప్పుడు నిద్ర రావడం అనేది చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే చదువుకునేటప్పుడు ప్రతి గంటకు చిన్న విరామం (5ని.లు) తీసుకోవాలి. చదువుతున్న గదిలో తగినంత వెలుతురు ఉండాలి. అలాగే ఏకాగ్రతను పెంచడానికి తరచుగా నీరు త్రాగాలి. నిద్ర ఎక్కువగా వస్తే 15-20 నిమిషాలపాటు నిద్రపోయి తిరిగి లేచి చదవాలి. ఇలా చేస్తే ఏకాగ్రత మెరుగుపడి, నిద్ర దూరమవుతుంది.