TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో విజయోత్సవాలకు.. ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25 నుంచి విభాగాల వారీగా సీఎం సమావేశాలు పెట్టనున్నారు.