కడప: సాస్కి పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కడప కలెక్టరేట్లో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై కలెక్టర్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జిల్లా పర్యాటక శాఖ, APTDC అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.