TG: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డిపై పారిశ్రామిక భూముల కుంభకోణం ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి ఇండస్ట్రీ భూములను బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టి, కమిషన్లను ఢిల్లీకి కప్పంగా చెల్లించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పారిశ్రామిక భూములను ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలన్నారు. బలవంతపు భూసేకరణ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.